Thursday, February 5, 2009

ఎందుకు చదవాలి

అసలు ఈ బ్లాగ్ నేను ఎందుకు చదవాలి?

నేను రాస్తున్నాను కాబట్టి .....

ఎవరునువ్వు ?

నేను నీలాగే ఒక సగటు మనిషిని ...

అలా ఐతే నువ్వు రాసే సొల్లు నాకెందుకు ?

నా సొల్లు అంటే నీ సొల్లు అనే .... అంటే మన అభిప్రాయలు మనం తెలుసుకోవడం అన్నమాట ....

సగటు మనిషి అభిప్రాయాలు నాకెందుకు బాబు ? ఏదో గొప్ప వాళ్ళవి ఐతే కొంచెం ఉపయోగం కాని ...ఉదాహరణికి ఎ గాంధీ వో , నెహ్రూ వో , సుభాష్ చంద్ర బోసు వో .... లేదా చంద్ర బాబు నాయుడు వో , రాజశేకర్ రెడ్డి వో ...... ఇంకాపోతే

ఎ హర్షద్ మెహతా వో ," స్టాంపు " తెల్గి వో ..మరీ లేటెస్ట్ గా మన సత్యం రామలింగరాజు వో ..ఐతే కనీసం కూటి కో ,గుడ్డ కో పనికొస్తుంది కాని ?

చూడు , సగటు మనిషి .... మనం మారము ... అందుకే మనం ఇంకా ఇలానే వున్నాం వాళ్ళు గొప్ప వాళ్ళయ్యారు .ముందు నీ గురించి నువ్వు తెలుసుకో .... నువ్వు చెప్పిన వారిలో మంచి వాళ్ళు వున్నారు , మోసగాళ్ళు వున్నారు .... కాని మంచి చేసినా , మోసం చేసినా .... ... వాళ్లు చేసిన దాంట్లో సక్సెస్ అయ్యారు ....ఎందుకంటే వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుసు ..వాళ్ళేమి చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితం గా తెలుసు . అందుకే మన "గురించి" మనం తెలుసుకుందాం .

సరే , ఏదో చెప్పావ్ ..... అర్థం అవ్వలేదు కాని వినడానికి బాగానే వుంది ? ఇంతకి ఇక్కడ నేను ఏమేమి చదవొచ్చు ?

సరిగ్గా అడిగావ్ ... నాకు (నీకు) నచ్చిన ఏదైనా రాసుకుందాం ,చదువుకుందాం ....చర్చిద్దాం . రోజుకి ఏదో ఒక కోత విషయం నేర్చుకుందాం (జ్యూస్ లాగా : జ్యూస్ ప్రతి రోజు సాయంత్రం ఒక చోట కలుసుకొని ఆ రోజుకి కొత్త గ ఏమి చేశాం, ఏమి నేర్చుకున్నాం అని డిస్కస్ చేసుకుంటారట .... మనం కాఫీ కేప్ లో కూర్చో ని పనికి రాని కబుర్లు చెప్పుకున్నట్టు.....

అడిగినదానికి సమాధానం చెప్పకుండా ఏదేదో చెప్తావేంటి ...? అసలు నీకు ఏమి తెలుసు ...?

సగటు మనిషి కి తెలియని విషయం ఏముంది చెప్పు ..... ఎ టాపిక్ అయినా సరే తెలిసిన ,తెలియకపోఇన తెలిసినట్టే చెప్తాడు ....నీకు ఒక కథ చెప్పనా ..... అక్బర్ ఒక రోజు సభ లో అందరిని అడిగాడట ..ఒక సగటు మానవుడి కి బాగా తెలిసిన శాస్త్రం ఏది అని ? అందరు మంత్రులు ఒకసారి నవ్వుకొని "సగటు మానవుడికి అసలు ఏమి తెలుస్తుంది రాజు గారు .... ఎ విషయం పూర్తిగా తెలియదు , అందుకే మనం కవులు ,మంత్రులు అయ్యాం ,వాళ్ళు ఇంకా సగటు మానవుడి గానే మిగిలి పోయారు " అని వెటకారం చేసారు . అప్పుడు బీర్బల్ మాత్రం ఇలా చెప్పాడు " సగటు మానవుడికి బాగా తెలిసిన శాస్త్రం వైద్య శాస్త్రం" అని .

"అదెలా సాద్యం " - సభ లో వున్నాఅందరు ముక్త కంఠం తో అడిగారు రాజు గారి తో సహా ...

అప్పుడు బీర్బల్ ఎంతో ప్రసాంతంగా .."మీరు ఒక్కసారి నాతో మారు వేషం వస్తే మీకు నిరూపిస్తాను " అని చెప్పాడు . అక్బర్ బీర్బల్ చెప్పినట్టే మారు వేషం లో ప్రజల మద్యకి వెళ్ళాడు ,తలకి దెబ్బ తగిలినట్టు గుడ్డ కట్టు కొని ....

మొదట ఒక మనిషి పొలం వెళ్తూ ,రాజు గారిని చూసి "అయ్యో పాపం ఏమైంది బాబు తలకి " అని అడిగాడు ... దానికి రాజు గారు "ఏమి లేదు , కొంచెం తల నొప్పిగా వుంది " అని చెప్పాడు ..అందుకు ప్రతిగా అతను .... మా పొలం ఒక మంచి మహిమ గల మొక్క వుండి దాని పసరు రాస్తే నొప్పి ఇట్టే పోతుంది " అని చెప్పాడు ...రాజు గారు నవ్వుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు .....అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించి మల్లి అదే అడిగింది ..రాజు గారు మల్లి అదే చెప్పారు .దానికి అవ్వ "వేడి వేడి నీళ్ళల్లో తులసి ఆకు వేసి తలకి రాస్తే నిప్పి పోతుంది "అని చెప్పింది . అలా అలా రాజు గారికి కనిపించిన ప్రతి ఒక్కరు ఏదో ఒక విరుగుడు చెప్తూనే వున్నారు ..... ఆ సభలో వెటకారం చేసిన కవులు , మంత్రులు తో సహా ... అప్పుడు రాజు గారు బీర్బల్ ని పిలిచి సభ మధ్యలో సత్కరించారు . అప్పుడు బీర్బల్ తనలో తాను నవ్వుకొని ఇలా అనుకున్న్నాడు " నేను వైద్య శాస్త్రం బదులు ఎశాస్త్రం చెప్పిన నాకు ఇలానే సత్కారం జరిగేది .....ఎందుకంటే సగటు మానవుడికి తెలియని విషయం లేదు .... తెలియాల్సిన అవసరం కూడా లేదు ...తెలిసిన ,తెలియకపాయిన అంతా తెలిసినట్టే చెప్తాడు " అని .

ఈ కథ నీ ప్రశ్న కి సమాధానం ఇచ్చిందా....ఓ సగటు మనిషి....

ఇక్కడ ఏమైనా చదవొచ్చు .. సినిమాలు , రాజకీయాలు , టెక్నాలజీ , వ్యక్తిత్వ వికాసం , జోక్స్ ..పైన చెప్పినట్టు "కాదేది బ్లాగ్ కి అనర్హం"

చదవండి .....మీ అభిమాన సిలికాన్ స్క్రీన్ లో ....... కలగూరగంప........